మంత్రి ఆదిమూలపు సురేశ్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్ 
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మంత్రి ఆదిమూలపు సురేశ్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్ 

CM Jagan attends minister Adimulapu Suresh daughter wedding reception
  • ఆదిమూలపు శ్రిష్టి, సిద్ధార్థ్ ల వివాహం
  • యర్రగొండపాలెంలో నేడు పెళ్లి రిసెప్షన్
  • వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
  • విందు కార్యక్రమంలో వైసీపీ శ్రేణుల సందడి
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కుమార్తె శ్రిష్టి వివాహం సిద్ధార్థ్ తో ఘనంగా జరిగింది. మంత్రి స్వస్థలం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పెళ్లి రిసెప్షన్ నిర్వహించగా, ముఖ్యమంత్రి సీఎం జగన్ హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్ రాకతో పెళ్లి రిసెప్షన్ లో వైసీపీ శ్రేణులు ఆనందోత్సాహాలు వెలిబుచ్చాయి. కాగా, ఈ విందు కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
CM Jagan
Adimulapu Suresh
Wedding Reception
Yarragondapalem
Prakasam District
YSRCP
Andhra Pradesh

More Telugu News