డాక్టర్ అవ్వాలనుకున్నాను.. అందుకే ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను: ఎమ్మెల్యే రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డాక్టర్ అవ్వాలనుకున్నాను.. అందుకే ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను: ఎమ్మెల్యే రోజా

Roja wanted to become a doctor
  • ఎంసెట్ కూడా రాశానన్న రోజా   
  • హీరోయిన్ గా అవకాశం రావడంతో అటువైపు వెళ్లానని వివరణ
  • ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చానని వ్యాఖ్య
ఏపీ రాజకీయాల్లో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తన మనసులోని భావాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో ఆమెదొక ప్రత్యేకమైన శైలి. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రోజా... సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లపాటు అగ్రతారగా కొనసాగారు. అయితే, తన విద్యార్థి దశలో ఆమె డాక్టర్ కావాలనుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.

తాను డాక్టర్ కావాలనేది తన కుటుంబసభ్యుల కల అని... దీంతో ఇంటర్ లో బైపీసీ తీసుకున్నానని రోజా తెలిపారు. ఎంసెట్ కూడా రాశానని... అయితే హీరోయిన్ గా సినిమాల్లో అవకాశం రావడంతో అటువైపు వెళ్లానని చెప్పారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించానని తెలిపారు. ఆ విధంగా డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యానని చెప్పారు.

మరోవైపు పుత్తూరు మండలం కేబీఆర్ పురంలో సుభాషిణి ఆసుపత్రి ఆధ్వర్యంలో జరిగిన ఉచిత వైద్య శిబిరంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడలో స్టెతస్కోప్ పెట్టుకుని, ఓ వ్యక్తికి బీపీ చెకప్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీపీ చూస్తూ డాక్టర్ కావాలనుకున్న తన కోరికను తీర్చుకున్నానని చెప్పారు. మంచి ఆహారాన్ని తీసుకుంటూ, ప్రతిరోజూ వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
Roja
YSRCP
Doctor

More Telugu News