'పుష్ప' ఐటెం సాంగ్​ మేల్​ వర్షన్​ విన్నారా?.. పేరడీ వీడియో ఇదిగో !

16-12-2021 Thu 13:40
  • పవన్, చిరు, బన్నీ, ప్రభాస్ పాటల వీడియోలకు పేరడీ లిరిక్స్
  • మీ కళ్లలోనే వంకర ఉందంటూ లిరిక్స్
  • ట్విట్టర్ లో తెగ ఎంజాయ్ చేస్తున్న నెటిజన్లు
Fan Recreated Pushpa Item Song With Male Version
ఊ అంటావా మావ.. ఊఊ అంటావా మావ.. అంటూ పుష్పలో సమంత ఆడిపాడిన ఐటెం సాంగ్ కు రెస్పాన్స్ ఓ రేంజ్ లో వస్తోంది. మగాళ్ల బుద్ధి ఇదంటూ సాగే ఈ పాటకు ఇప్పుడు వాలి అనే ఓ అభిమాని పేరడీ కట్టేశాడు. దానికి మేల్ వర్షన్ ను రూపొందించాడు. తమ్ముడు, అత్తారింటికి దారేది, బిల్లా, సన్నాఫ్ సత్యమూర్తి, ఖైదీ నంబర్ 150 సినిమాల్లోని స్టెప్పులకు తన సొంత లిరిక్స్ ను జోడించి ట్విట్టర్ లో వదిలాడు. ఆ పాట చూస్తూ నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

‘ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాప’ అంటూ హుషారెత్తించాడు. ‘లుంగీపైనా ఉంటే ఒకతి కంగాళీగా చూస్తుంది.. సూటూ బూటు వేశావంటే స్వీటుహార్టు అంటుంది’ అంటూ స్టార్ట్ చేసి.. ‘మీ కళ్లలోనే వంకర ఉంది.. ఆడాళ్ల బుద్దే వంకర బుద్ధి’ అంటూ పేరడీని రసవత్తరంగా మార్చేశాడు. ‘సినిమా హీరో అంటే ఒకతి సచ్చిసచ్చిపోతుంది.. సినిమా హీరోకి అభిమాని అంటే పోరా బాబు అంటుంది’ అంటూ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు ఆ అభిమాని. మొత్తానికి ఆ అభిమాని ఎంచుకున్న వివిధ పాటలు, దానికి తగ్గట్టు ‘ఊ అంటావా’ పేరడీ లిరిక్స్ తో మేల్ వర్షన్ ను అదరగొట్టేశాడు. మరి, మీరూ వినేయండి.. పేరడీ ఫుల్ పాట!