Hyderabad: హైదరాబాద్ నుంచి చీరాల వెళుతున్న ప్రైవేటు బస్సు దగ్ధం

Private Bus Caught fire in Prakasam dist
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్ నుంచి చీరాల వెళుతున్న ప్రైవేటు బస్సు ఒకటి ప్రకాశం జిల్లాలో దగ్ధమైంది. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద జరిగిందీ ఘటన. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన ప్రయాణికులు కిటికీల నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. లేదంటే పెను ప్రమాదమే జరిగి ఉండేది.

ఎగసిపడిన అగ్నికీలలు బస్సును పూర్తిగా దగ్ధం చేశాయి. ప్రయాణికుల సామగ్రి కూడా కాలి బూడిదైంది. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Hyderabad
Chirala
Private Bus
Fire Accident

More Telugu News