Pushpa: 'పుష్ప' నుంచి సమంత ఐటం సాంగ్ 'ఊ అంటావా మావా... ఊఊ అంటావా' రిలీజ్... యూట్యూబ్ లో ప్రభంజనం

Item song from Pushpa released
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్ హీరోగా వస్తున్న 'పుష్ప' చిత్రంలో సమంత నటించిన ఐటం సాంగ్ ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. 'ఊ అంటావా మావా ఊఊ అంటావా' అంటూ హస్కీగా సాగే ఈ పాట యూట్యూబ్ లో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే 4 మిలియన్ల వ్యూస్ తో పాటు 3 లక్షల లైకులు కూడా సొంతం చేసుకుని, మరింతగా దూసుకుపోతోంది. ఈ ఐటమ్ సాంగ్ ను పలు భాషల్లో రూపొందించారు. తెలుగులో 'ఊ అంటావా మావా ఊఊ అంటావా' అంటూ సాగే ఈ గీతాన్ని కొత్తమ్మాయి ఇంద్రావతి చౌహాన్ ఆలపించింది. 'మీ మగబుద్ధే వంకరబుద్ధి' అంటూ ఇంద్రావతి గొంతుకలో ఈ ఐటం పాట మరింత కొత్తగా ధ్వనించింది.
Go Back to Shorts
Pushpa
Item Song
Samantha
Allu Arjun
Sukumar
Devi Sri Prasad

More Telugu News