హెలికాప్టర్ ప్రమాద స్థలికి వెళ్లనున్న తమిళనాడు సీఎం స్టాలిన్
- నీలగిరి వద్ద హెలికాప్టర్ ప్రమాదం
- హెలికాప్టర్ లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన అర్ధాంగి
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రావత్
- ఈ సాయంత్రం నీలగిరి చేరుకోనున్న సీఎం స్టాలిన్
కాగా, ఈ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ వెంటనే స్పందించారు. ఘటన స్థలికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ సాయంత్రం చెన్నై నుంచి కోయంబత్తూరు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నీలగిరి వెళతారు.
కాగా, ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ సాక్షి కథనం ప్రకారం.... మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్ ను చూశామని చెప్పారు. హెలికాప్టర్ కూలిపోతున్న సమయంలో చెట్ల మీదుగా ముగ్గురు వ్యక్తులు కిందికి పడిపోవడం గమనించామని, అయితే మంటలు వ్యాపించడంతో తాము వెళ్లలేకపోయామని ఆ వ్యక్తి వెల్లడించారు.