'మనసా నమః'... ఆస్కార్ బరిలో తెలుగు షార్ట్ ఫిలిం
- దీపక్ దర్శకత్వంలో 'మనసా నమః' లఘుచిత్రం
- ప్రధాన పాత్రల్లో విరాజ్ అశ్విన్, దృశిక
- ఇప్పటివరకు 900 అవార్డులు
- ఈ నెల 10 నుంచి ఆస్కార్ సభ్యులకు ప్రదర్శన
డిసెంబరు 10 నుంచి ఈ లఘు చిత్రాన్ని ఆస్కార్ సభ్యులకు ప్రదర్శించనున్నారు. ఆస్కార్ సభ్యుల నుంచి గణనీయమైన స్థాయిలో ఓట్లు పొందగలిగితే ఈ షార్ట్ ఫిలింకు విశిష్ట పురస్కారం ఖాయమైనట్టే! హైదరాబాదులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో 'మనసా నమః' యూనిట్ ఈ సంగతులు వెల్లడించింది.