ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరం ఇదేనట!
- ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తాజా నివేదిక
- అత్యంత ఖరీదైన నగరంగా టెల్ అవీవ్
- ఇజ్రాయెల్ లో ద్రవ్యోల్బణం
- టెల్ అవీవ్ లో విపరీతంగా పెరిగిపోయిన జీవన వ్యయం
తాజాగా ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను రూపొందించింది. టెల్ అవీవ్ గతంతో పోల్చితే ఐదు స్థానాలు ఎగబాకి ప్రథమస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఖరీదైన నగరాలుగా పారిస్, సింగపూర్ సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు ఉన్నాయి.
మొత్తం 173 నగరాల్లో ధరలు, ఇతర సేవలను పరిగణనలోకి తీసుకుని ఈఐయూ ఈ జాబితా రూపొందించింది. అమెరికా డాలర్ ను ప్రామాణికంగా తీసుకుని అధ్యయనం చేపట్టారు. గత ఏడాది ఈ జాబితాలో పారిస్, జ్యూరిచ్, హాంకాంగ్ నగరాలు అగ్రస్థానాన్ని పంచుకున్నాయి.