Balakrishna: అఘోర పాత్రలో బాలయ్య విజృంభించారు: శ్రీకాంత్

  • బోయపాటి నుంచి 'అఖండ'
  • రెండు డిఫరెంట్ లుక్స్ తో బాలయ్య
  • ప్రతినాయక పాత్రలో శ్రీకాంత్
  • వచ్చేనెల 2వ తేదీన విడుదల
Akhanda movie update

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో రూపొందిన 'అఖండ' సినిమా, డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం బాలకృష్ణ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పుంజుకున్నాయి.

ఈ సినిమాలో పవర్ఫుల్ ప్రతినాయకుడి పాత్రను శ్రీకాంత్ పోషించాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, " బాలకృష్ణ గారి పాత్రలను బోయపాటి అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో ఆయన డైలాగ్స్ మరింత పవర్ఫుల్ గా ఉంటాయి. ముఖ్యంగా అఘోర పాత్రలో ఆయన విజృంభించారు. ఆయన యాక్టింగ్ ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది.

కథాకథనాల పరంగా .. పాటల పరంగా .. ఈ సినిమా బాలకృష్ణ గారి కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలుస్తుంది. ఈ సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశాలు లభించడం నా అదృష్టం. ఈ సినిమాలో నేను చేసిన విలన్ రోల్ కి కూడా మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News