Balakrishna: వైజాగ్ లో 'అఖండ' ప్రీ రిలీజ్ ఈవెంట్?

  • బాలకృష్ణ నుంచి మరో భారీ చిత్రం 
  • రైతుగా .. అఘోరగా డిఫరెంట్ లుక్స్
  • ఈ నెల చివరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్  
  • డిసెంబర్ 2వ తేదీన భారీ రిలీజ్  
Akhanda movie update

బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందింది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రలను పోషించారు. మోతుబరి రైతుగా .. అఘోరగా ఆయన ఈ సినిమాలో అభిమానులను అలరించనున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ సందడి చేయనుంది. ఈ సినిమాలో పవర్ఫుల్ ప్రతినాయకుడిగా శ్రీకాంత్ నటించాడు. మరో కీలకమైన పాత్రను జగపతిబాబు పోషించాడు. డిసెంబర్ 2వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. వైజాగ్ లో ఈ వేడుక నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 27న గానీ 28న గాని ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాకి సంగీతాన్ని తమన్ అందించిన సంగతి తెలిసిందే.

More Telugu News