బాలయ్యతో సినిమా ప్లాన్ చేస్తున్న కొరటాల!

Balakrishna in Koratala movie
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'ఆచార్య'
  • త్వరలో సెట్స్ పైకి ఎన్టీఆర్ సినిమా 
  • బాలకృష్ణ కోసం కథ సిద్ధం 
  • త్వరలో రానున్న స్పష్టత  
కొరటాల ఒక వైపున యంగ్ స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే, మరో వైపున సీనియర్ స్టార్ హీరోలను కూడా ఒక్కొక్కరిని లైన్లో పెడుతున్నట్టుగా అనిపిస్తోంది. ప్రభాస్ .. మహేశ్ .. ఎన్టీఆర్ లకు భారీ హిట్లు ముట్టజెప్పిన ఆయన, ఆ తరువాత సినిమాగా చిరంజీవితో 'ఆచార్య' సినిమా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది.

'ఆచార్య' సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల కానుంది. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో చేయనున్నారు. 'జనతా గ్యారేజ్' తరువాత ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మరో సినిమా ఇది. ఈ సినిమా తరువాత బాలకృష్ణతో ఒక సినిమా చేసే ఆలోచనలో కొరటాల ఉన్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది.

లాక్ డౌన్ సమయంలో ఆయన బాలకృష్ణ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ రెడీ చేశారట.  ఈ కథ బాలకృష్ణ మాత్రమే చేయగలరు అనేలా ఉంటుందట. ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత ఈ ప్రాజెక్టు ఉండొచ్చని అంటున్నారు. అయితే ఈ కథను బాలకృష్ణకి వినిపించారా లేదా అనే విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. మరి ఈ ప్రచారం ఎంతవరకూ వాస్తవముందనేది చూడాలి.
Go Back to Shorts
Balakrishna
Koratala Siva
Up Coming Movie

More Telugu News