‘ఇఫి’లో ప్రసంగించాలంటూ సమంతకు ఆహ్వానం.. ఆ గౌరవాన్ని దక్కించుకున్న తొలి దక్షిణాది నటిగా సామ్

Samantha Invited to IFFI to speak
  • ఈ నెల 28-30 మధ్య గోవాలో ఫిల్మ్ ఫెస్టివల్
  • సామ్‌తోపాటు బాలీవుడ్ నటులు, దర్శకులకు కూడా ఆహ్వానం
  • వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత
టాలీవుడ్ స్టార్ నటి సమంతకు అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి)లో ప్రసంగించేందుకు రావాలంటూ ఆమెకు ఆహ్వానం అందింది. ఫలితంగా ఆ గౌరవం అందుకున్న తొలి దక్షిణాది నటిగా రికార్డులకెక్కారు. ఈ నెల 28 నుంచి 30 వరకు గోవాలో జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సమంతతో పాటు బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, దర్శకులు అర్జున్ రాజే, వివేక్ అగ్నిహోత్రి, నటుడు జాన్ ఎతత్తిల్ కూడా ఆమెతోపాటు ప్రసంగించనున్నారు.  

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమంత నటించిన ‘శాకుంతలం’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తమిళంలో నటించిన ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మరోపక్క, ప్రముఖ నటి తాప్సి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న మరో సినిమాకు కూడా సమంత సైన్ చేసినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Samantha
IFFI
Tollywood
Goa

More Telugu News