భారత్ బయోటెక్ 'కొవాగ్జిన్'కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి
- కొవాగ్జిన్ పై సమీక్ష నిర్వహించిన డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా బృందం
- కొవాగ్జిన్ ను ప్రపంచ దేశాలకు సరఫరా చేసే అవకాశం
- భారతీయులు విదేశాలకు వెళ్లినప్పుడు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం ఉండదు
ఈ గుర్తింపు వల్ల టీకాను ప్రపంచ దేశాలకు సరఫరా చేసే వీలు కలుగుతుంది. ఈ టీకాను తీసుకున్న భారత పౌరులు విదేశాలకు వెళ్లినప్పుడు వారిపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. వారు క్వారంటైన్ లో ఉండాల్సిన అవసరం ఉండదు. కొవాగ్జిన్ ను భారత్ లో పెద్ద ఎత్తున వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టీకా రెండు డోసులు తీసుకుంటే కరోనాకు సంబంధించిన పలు వేరియంట్ల నుంచి రక్షణ లభిస్తుంది.