Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'దసరా'లో మరో నాయికగా సమంత 
  • రవితేజ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్
  • సాయితేజ్ 'రిపబ్లిక్' డిజిటల్ ప్రీమియర్
Samantha opposite Nani again

*  నేచురల్ స్టార్ నాని సరసన సమంత మరోసారి నటించే అవకాశం కనిపిస్తోంది. నాని హీరోగా ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలో రూపొందే 'దసరా' చిత్రంలో ఓ కథానాయికగా ఇప్పటికే కీర్తి సురేశ్ ని ప్రకటించారు. మరో నాయికగా సమంతను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
*  రవితేజ నటించే 70వ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తాడు. ప్రస్తుతం రవితేజ చేస్తున్న సినిమాలు పూర్తికాగానే ఇది సెట్స్ కి వెళుతుంది. ఇక ఈ చిత్రానికి 'రావణాసుర' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ని పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం.
*  మెగా హీరో సాయితేజ్ హీరోగా దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన 'రిపబ్లిక్' చిత్రం అక్టోబర్ ఒకటిన థియేటర్లలో విడుదలైన విషయం విదితమే. ఇప్పుడీ చిత్రాన్ని ZEE 5 ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. ఇందులో ఐశ్వర్య రాజేశ్ కథానాయికగా నటించింది.

More Telugu News