Anjali: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మలయాళం రీమేక్ లో అంజలి 
  • బాలకృష్ణ షోలో ప్రభాస్, ఎన్టీఆర్
  • చరణ్, కియారాలపై పూణేలో పాట   
Anjali in lead role of Malayalam remake

*  అంజలి ప్రధానపాత్రధారిగా ఓ చిత్రం మొదలైంది. కరుణకుమార్ దర్శకత్వంలో 'గీతా ఆర్ట్స్ 2' బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ నిన్న ప్రారంభమైంది. మలయాళ చిత్రం 'నయట్టు' ఆధారంగా రూపొందే ఈ చిత్రంలో ఇంకా ప్రియదర్శి, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
*  నందమూరి బాలకృష్ణ తొలిసారిగా 'అన్ స్టాపబుల్' పేరిట 'ఆహా' ఓటీటీ కోసం ఓ షోను హోస్ట్ చేస్తున్న సంగతి విదితమే. దీపావళి రోజున స్ట్రీమింగ్ అయ్యే తొలి ఎపిసోడ్ లో ప్రముఖ నటుడు మోహన్ బాబు అతిథిగా విచ్చేస్తున్నారు. అలాగే ఆ తర్వాత ఎపిసోడ్లలో ప్రభాస్, ఎన్టీఆర్ కూడా అతిథులుగా వస్తున్నట్టు సమాచారం.  
*  రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం షూటింగ్ గత నెల 22 నుంచి పూణేలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఇప్పటికే ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించగా, ప్రస్తుతం చరణ్, కియారా అద్వానీలపై ఓ పాటను షూట్ చేస్తున్నారు. రేపటితో ఈ షెడ్యూలు పూర్తవుతుంది.
*  రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న 'అనుభవించు రాజా' చిత్రాన్ని ఈ నెల 26న రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో కశిష్ ఖాన్ హీరోయిన్ గా నటించింది.

More Telugu News