తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

26-10-2021 Tue 21:37
  • గత 24 గంటల్లో 41,388 కరోనా పరీక్షలు
  • 190 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 4,101 మందికి చికిత్స
Telangana corona cases update
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 41,388 కరోనా పరీక్షలు నిర్వహించగా, 190 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. వికారాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 111 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,70,643 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,62,592 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,101 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,950కి పెరిగింది.