Keerti Suresh: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Keerti Suresh as a shooter in Good Luck Sakhi
షార్ట్స్‌లో చూడండి
*  నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ కథానాయికగా రూపొందిన 'గుడ్ లక్ సఖి' చిత్రాన్ని నవంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతలు తాజాగా ప్రకటించారు. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి షూటర్ గా నటించింది.
*  ప్రస్తుతం 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు' సినిమాలలో నటిస్తున్న పవన్ కల్యాణ్ వీటి తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు.. భగత్ సింగ్' చిత్రాన్ని చేయనున్నారు. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది రాజకీయ నేపథ్యంలో రూపొందుతుందని సమాచారం.
*  ఎనర్జిటిక్ హీరో రామ్, లింగుస్వామి కలయికలో రూపొందుతున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం రెండో షెడ్యూలు షూటింగ్ ముగిసింది. కొంత విరామం తర్వాత చివరి షెడ్యూలును ప్రారంభిస్తారు. ఇందులో కృతిశెట్టి, అక్షర గౌడ హీరోయిన్లుగా నటిస్తున్నారు.    
Go Back to Shorts
Keerti Suresh
Pawan Kalyan
Shekhar Kammula
Ram

More Telugu News