Shiva Kanthamaneni: హరీశ్ శంకర్ చేతుల మీదుగా 'మధురపూడి గ్రామం అనే నేను' ఫస్టు లుక్!

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • హీరోగా శివ కంఠమనేని పరిచయం
  • దర్శకుడిగా మల్లి మరో ప్రయత్నం 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు  
Madhurapudi Gramam Ane Nenu first look rteleased

శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు నిర్మాతలు. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 'కత్తి' సినిమా దర్శకుడు మల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

విజయదశమి పండగ శుభాకాంక్షలతో ఈ సినిమా ఫస్టు లుక్ ను, మోషన్ పోస్టర్ ను దర్శకుడు హరీశ్ శంకర్ రిలీజ్ చేశాడు. ఫస్టు లుక్, మోషన్ పోస్టర్ రెండూ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయన్న హరీశ్ శంకర్, ఈ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలియజేశాడు.

ఈ చిత్రానికి సహ నిర్మాతలు - కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - కె శ్రీనివాసరావు, వై. అనిల్ కుమార్, సంగీతం - మణిశర్మ, సినిమాటోగ్రఫీ - సురేష్ భార్గవ్, ఎడిటర్ - గౌతమ్ రాజు, ఫైట్స్ - రామకృష్ణ, మాటలు - ఉదయ్ కిరణ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ నరేన్ జి సూర్య, కో డైరెక్టర్ : ఆర్. ఎస్. సురేష్, పీఆర్వో - జీఎస్ కే మీడియా, సమర్పణ - జి రాంబాబు యాదవ్, బ్యానర్ - లైట్ హౌస్ సినీ మ్యాజిక్, నిర్మాతలు - కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం - మల్లి

More Telugu News