Kim Jong Un: హాయిగా బీరు తాగుతూ ఆయుధ ప్రదర్శన ఎంజాయ్ చేసిన కిమ్ జాంగ్ ఉన్... వీడియో ఇదిగో!

  • ఉత్తర కొరియా ఆయుధ ప్రదర్శన
  • హాజరైన కిమ్ జాంగ్ ఉన్
  • గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా కనిపించిన కిమ్
  • ప్రదర్శన ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదన
Kim Jong Un enjoys with beer and smoke at defense expo

అమెరికా పట్ల ఎన్నో సందేహాలతో ఉన్న ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆ దేశం ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనలో దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా పాల్గొన్నారు. తాజాగా, ఆయనకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది.

తమ దేశ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తుండగా, ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించడం ఆ వీడియోలో కనిపించింది. అంతేకాదు, తన సైనిక జనరళ్లతో కలిసి హాయిగా బీరు తాగుతూ, చేతిలో సిగరెట్ తో సేదదీరుతున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా కిమ్ ఉన్నట్టు తాజా ఫుటేజి వెల్లడిస్తోంది.

More Telugu News