Corona Virus: ఏపీలో కొత్తగా 517 మందికి కొవిడ్ పాజిటివ్

AP Corona cases and deaths media report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 38,786 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 517 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 97 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 88, గుంటూరు జిల్లాలో 84, కృష్ణా జిల్లాలో 71 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 2 కేసులు వెలుగు చూశాయి.

అదే సమయంలో 826 మంది కరోనా నుంచి కోలుకోగా, 8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,58,582 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,37,691 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 6,615 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,276కి పెరిగింది.
Go Back to Shorts
Corona Virus
Today Cases
Deaths
Media Bulletin
Andhra Pradesh

More Telugu News