Prabhas: 'స్పిరిట్' కోసం ఉత్సాహంతో ఉన్నాను: ప్రభాస్

  • ప్రభాస్ 25వ సినిమాగా 'స్పిరిట్'
  • ఫ్యాన్స్ కోరుకున్నట్టుగా కనిపిస్తాను
  • అద్భుతమైన కథాంశం
  • వివిధ భాషల్లో విడుదల
Spirit movie update

కొన్ని రోజులుగా అంతా కూడా ప్రభాస్ 25వ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ఆయన 25వ సినిమా ఎవరి దర్శకత్వంలో ఉండనుందనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధ్యమైనంతవరకూ రాజమౌళి దర్శకత్వంలోనే ఉంటుందని అనుకున్నారు. ఆ తరువాత జాబితాలో సందీప్ రెడ్డి .. సిద్ధార్థ్ ఆనంద్ పేర్లు వినిపించాయి.ప్రభాస్ తన 25వ సినిమాను సందీప్ రెడ్డి దర్శకత్వంలోనే చేయనున్నాడనే అధికారిక ప్రకటన వచ్చింది. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు

ఈ సినిమాను గురించి ప్రభాస్ మాట్లాడుతూ .. "25వ సినిమాగా 'స్పిరిట్' చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఒక అద్భుతమైన కథాంశం. ఈ సినిమాలోలా నన్ను చూడాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఈ సినిమా కోసం పనిచేయడానికి ఎక్కువ కాలం వెయిట్ చేయలేను" అంటూ తన ఆసక్తిని .. ఆత్రుతను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే, ఈ కొత్త ప్రాజెక్టు మొదలవుతుంది. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News