రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌర‌వం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రోజా కుమార్తె అన్షుకు అరుదైన గౌర‌వం!

ansu gets award
  • ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్-యూకే మ్యాగజైన్ కవర్ పేజీపై ఫొటో
  • క్వీన్ ఆఫ్ టాలెంట్ గా పేర్కొన్న మ్యాగ‌జైన్
  • ఓ రచయిత్రిగా, వ్య‌వ‌స్థాప‌కురాలిగా, ప్రోగ్రామర్‌గా కృషి
  • యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక  
వైసీపీ నాయ‌కురాలు, నగరి ఎమ్మెల్యే రోజా కుమార్తె అన్షు మాలిక ఫొటో 'ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్-యూకే' మ్యాగజైన్ కవర్ పేజీకి ఎక్కింది. క్వీన్ ఆఫ్ టాలెంట్ గా పేర్కొంటూ అన్షు ఫొటోను ప్రచురించారు. ఓ రచయిత్రిగా, వ్య‌వ‌స్థాప‌కురాలిగా, ప్రోగ్రామర్‌గా సమాజం కోసం ప‌ని చేస్తోన్న విద్యార్థినిగా ఆమె కృషిని ప్ర‌శంసిస్తూ ఈ ప్ర‌ఖ్యాత మ్యాగ‌జైన్ ఆమెను యంగ్ సూపర్ స్టార్ అవార్డుకు ఎంపిక చేసింది.

త‌న‌కు ఈ  అవార్డు రావ‌డం ప‌ట్ల అన్షు స్పందించింది. తన కల నెలవేరిందని తెలిపింది. అక్టోబ‌రు మ్యాగ‌జైన్‌లో ఆమెకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను చ‌దువుకోవ‌చ్చ‌ని పేర్కొంది. రోజాకు కుమార్తె అన్షుతో పాటు కుమారుడు కృష్ణ లోహిత్ కూడా ఉన్న విష‌యం తెలిసిందే.

    
Roja
Tollywood
Andhra Pradesh
YSRCP

More Telugu News