తెలంగాణలో మరో 220 మందికి కరోనా పాజిటివ్
- గత 24 గంటల్లో 44,200 కరోనా టెస్టులు
- కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
- తాజాగా 255 మందికి కరోనా నయం
- రాష్ట్రంలో ఒకరి మృతి
- ఇంకా 4,549 మందికి చికిత్స
అదే సమయంలో 255 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,65,504కి చేరింది. 6,57,040 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇంకా 4,549 మందికి చికిత్స జరుగుతోంది. కరోనా మృతుల సంఖ్య 3,915కి పెరిగింది.
