Andhra Pradesh: ​ఏపీలో మరో 1,167 మందికి కరోనా పాజిటివ్

AP corona media report
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 55,307 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,167 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 224, చిత్తూరు జిల్లాలో 167, నెల్లూరు జిల్లాలో 141, ప్రకాశం జిల్లాలో 130 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు.

అదే సమయంలో 1,487 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,45,657 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,18,324 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 13,208 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా మృతుల సంఖ్య 14,125కి పెరిగింది.

Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Today Cases
Deaths

More Telugu News