రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

jagan to visit delhi
  • మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై అమిత్ షా ఎల్లుండి భేటీ
  • పాల్గొన‌నున్న ప‌లు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 
  • తిరిగి ఏపీకి 26న లేక 27న‌ రానున్న జ‌గ‌న్
మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన న్యూఢిల్లీలో ఎల్లుండి సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణ, ఏపీతో పాటు యూపీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, బీహార్‌ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు పాల్గొంటున్నారు.

ఇందులో పాల్గొనాల్సి ఉన్న నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్  రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అలాగే, ఆయ‌న రెండు రోజుల పాటు ఢిల్లీలోనే వుంటారు. తిరిగి ఎల్లుండి సాయంత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రానున్నారు. అమిత్ షాతో విడిగానూ సమావేశం అయ్యేందుకు జ‌గ‌న్ ప్రయత్నిస్తున్నట్లు స‌మాచారం. ఒక‌వేళ ఈ అపాయింట్‌మెంట్ ఖరారైతే మాత్రం జ‌గ‌న్ ఈ నెల‌ 27 ఉదయం ఏపీకి వ‌స్తారు.

కాగా, మావోయిస్టు పార్టీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా యువకులను రిక్రూట్‌ చేసుకోవాలని మావోలు వ్యూహాలు ర‌చించుకున్నారు. ప‌లు రాష్ట్రాల్లో స‌మావేశాలు జ‌రుపుతూ ఆదివాసీల‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌లు రాష్ట్రాల సీఎంల‌తో అమిత్ షా భేటీ కానుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
Jagan
YSRCP
New Delhi
Amit Shah

More Telugu News