Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మెగాస్టార్ సరసన తమన్నా
  • 'ఉప్పెన' దర్శకుడితో మహేశ్
  • సీక్వెల్ దిశగా కంగన 'తలైవి'  
Thamanna to play lead role opposite Chiranjeevi

*  తాజాగా 'ఆచార్య' చిత్రాన్ని పూర్తిచేసి, ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత 'భోళా శంకర్' చిత్రంలో నటించనున్నారు. తాజాగా ఈ చిత్రంలో కథానాయిక పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తమిళంలో వచ్చిన 'వేదాళం' చిత్రానికి రీమేక్ గా రూపొందే ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తారు.
*  'ఉప్పెన' చిత్రంతో టాలెంటెడ్ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న బుచ్చిబాబు సానా ఇటీవల సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిసినట్టు తెలుస్తోంది. తన కోసం ఓ కథను సిద్ధం చేయమని మహేశ్ ఆయనకు చెప్పినట్టు, వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
*  తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితకథతో కంగన రనౌత్ ప్రధాన పాత్రలో ఇటీవల వచ్చిన 'తలైవి' చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలో ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు, రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం దీనికి కథను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

More Telugu News