కేటీఆర్ పరువునష్టం దావాపై సిటీ సివిల్ కోర్టులో విచారణ
- కేటీఆర్ పై డ్రగ్స్ సంబంధ ఆరోపణలు చేసిన రేవంత్
- పరువునష్టం దావా వేసిన కేటీఆర్
- వాదనలు వినిపించిన కేటీఆర్ తరఫు న్యాయవాదులు
- రేవంత్ రూ.1 కోటి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి
కేటీఆర్ కు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని వాదనలు వినిపించారు. కేటీఆర్ కు రేవంత్ రెడ్డి రూ.1 కోటి పరువునష్టం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కేటీఆర్ తరఫున న్యాయవాదులు కోర్టును కోరారు. ఇలాంటి అసంబద్ధ ఆరోపణలు మరోసారి చేయకుండా శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేశారు. దీనిపై కాసేపట్లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.