నన్ను రాజీనామా చేయమనడానికి ఆయనెవరు?: ఏపీ హోంమంత్రి సుచరిత
- టీడీపీ హయాంలోనే రంగాను హత్య చేశారు
- జగన్ పై కోడికత్తితో దాడి చేస్తే టీడీపీ నేతలు ఎగతాళి చేశారు
- జగన్ ఆదేశిస్తే ఏ క్షణంలోనైనా రాజీనామా చేస్తా
మహిళల కోసం గత చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదని సుచరిత విమర్శించారు. మహిళల గురించి మాట్లాడే ముందు ఆలోచించాలని... మహిళలపై చంద్రబాబుకు నిజంగా గౌరవం ఉంటే అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాతీర్పును టీడీపీ గౌరవించడం లేదని మండిపడ్డారు. తమ పాలన నచ్చకపోతే ప్రజలే సమాధానం చెపుతారని అన్నారు. జగన్ ఆదేశిస్తే ఏ క్షణమైనా తాను రాజీనామా చేస్తానని చెప్పారు.