మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్?

Rajamouli and Prabhas new project
  • 'బాహుబలి'తో సంచలన విజయం
  • మారిపోయిన ప్రభాస్ కెరియర్ గ్రాఫ్
  • మైత్రీ బ్యానర్లో మరో సినిమా
  • ప్రభాస్ కి లైన్ వినిపించిన రాజమౌళి  
తెలుగులో ప్రభాస్ కి మొదటి నుంచి కూడా మాస్ ఫాలోయింగ్ ఉంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో 'బాహుబలి' చేసిన తరువాత ఆయన క్రేజ్ ఎల్లలు దాటి వెళ్లింది. 'బాహుబలి' విజయం ఆయన కెరియర్ గ్రాఫ్ ను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు.

'రాధేశ్యామ్' .. 'సలార్' .. 'ఆది పురుష్' సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ సైన్స్ ఫిక్షన్ చేయనున్నాడు. ఈ సినిమా తరువాత ప్రభాస్ మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా బలంగా వినిపిస్తోంది. ఈ ప్రాజెక్టును మైత్రీ మూవీ మేకర్స్ వారు సెట్ చేస్తున్నారట.

ఈ సినిమాకి సంబంధించిన లైన్ ను ఇప్పటికే ప్రభాస్ కి రాజమౌళి చూచాయగా చెప్పినట్టుగా అనుకుంటున్నారు. అయితే ఇది 'బాహుబలి స్థాయి ప్రాజెక్టు కాదట. 6 నెలలలో షూటింగు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మహేశ్ బాబుతో రాజమౌళి సినిమా పూర్తయిన తరువాతనే ఈ సినిమా ఉంటుంది. ఈ లోగా ప్రభాస్ తన ప్రాజెక్టులను పూర్తిచేస్తాడన్న మాట.
Rajamouli
Prabhas
Mythri

More Telugu News