Raju: సైదాబాద్ నిందితుడి ఫొటో ఇదిగో... పట్టిస్తే రూ.10 లక్షలు.. వైరల్ అవుతోన్న పోలీస్ ప్రెస్ నోట్!

Hyderabad police announces reward on Saidabad culprit Raju
  • సైదాబాద్ లో ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
  • ప్రాణాలు విడిచిన బాలిక
  • పరారీలో నిందితుడు రాజు
  • పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు
  • నిందితుడు రాజుపై రివార్డు ప్రకటన
హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి ఆమె మరణానికి కారకుడైన రాజు అనే యువకుడు పరారీలో ఉన్నాడు. నిందితుడ్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేకపోయారంటూ పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పోలీసులు నిందితుడు రాజుపై రివార్డు ప్రకటించారు. రాజు ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షలు ఇస్తామని స్పష్టం చేశారు. అతడి గురించిన సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ పేరిట ఓ ప్రకటన జారీ చేశారు.

నిందితుడి పూర్తిపేరు పల్లకొండ రాజు అని, వయసు 30 సంవత్సరాలు అని ఆ ప్రకటనలో తెలిపారు. పెద్ద జుట్టు ఉంటుందని, జట్టును రబ్బర్ బ్యాండ్ తో ముడేసుకుని తిరుగుతుంటాడని వెల్లడించారు. ఎత్తు 5.9 అడుగులు ఉంటాడని, రెండు చేతులపై మౌనిక అనే పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నాడని వివరించారు. సాధారణ ప్యాంటు, షర్టు, టోపీ ధరించి, ఎర్రటి స్కార్ఫ్ ను మెడకు చుట్టుకుని ఉన్నాడని తెలిపారు. చిరుగడ్డం ఉందని వివరించారు. మద్యం సేవించి ఫుట్ పాత్ లపైనా, బస్టాండ్లలోనూ నిద్రిస్తుంటాడని తెలిపారు.

అతడిని గుర్తించిన వారు, అతడి గురించి తెలిసిన వారు 9490616366 (డీసీపీ ఈస్ట్ జోన్), 9490616627 (టాస్క్ ఫోర్స్ డీసీపీ) ఫోన్ నెంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని ఆ ప్రకటనలో కోరారు. కాగా, రాజు తన స్నేహితుడితో వెళుతున్న వీడియో ఫుటేజీ మీడియాలో దర్శనమిస్తోంది.
Raju
Saidabad Incident
Reward
Police
Hyderabad

More Telugu News