గుజరాత్ రిమోట్ కంట్రోల్ ఢిల్లీ చేతుల్లో ఉందని స్పష్టమైంది: రూపానీ రాజీనామాపై కాంగ్రెస్ స్పందన
- గుజరాత్ రాజకీయాల్లో సంచలనం
- సీఎం పదవికి విజయ్ రూపానీ రాజీనామా
- చేతగాని ప్రభుత్వం అంటూ హార్దిక్ పటేల్ విమర్శలు
- వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయమని వెల్లడి
కరోనా సంక్షోభ సమయంలో ఈ ప్రభుత్వ అసమర్థత బయటపడిందని, ఆక్సిజన్ కొరత, శ్మశాన వాటికల వద్ద కనిపించిన ఘోర దృశ్యాలతో గుజరాత్ దుస్థితి యావత్ ప్రపంచం చూసిందని అన్నారు. మరోవైపు ద్రవ్యోల్బణంతో వ్యాపారులు తీవ్ర నష్టాల పాలయ్యారని, నిరుద్యోగిత పెచ్చరిల్లిందని, పరిశ్రమల మూసివేత కొనసాగుతోందని హార్దిక్ పటేల్ వివరించారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెంతకాలం గుజరాత్ ను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా పాలిస్తారు? ఇంకెంతకాలం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుతారు? అని ప్రశ్నించారు. 2014 తర్వాత గుజరాత్ లో ఓ సీఎంను మార్చడం ఇదే ప్రథమం అని, కానీ అసలైన మార్పు వచ్చే ఏడాది ఎన్నికల్లో కనిపిస్తుందని, బీజేపీని ప్రజలు కూకటివేళ్లతో పెకలించివేయడం అప్పుడు చూస్తారని హార్దిక్ స్పష్టం చేశారు.