Andhra Pradesh: ఏపీలో గత 24 గంటల్లో 1,145 మందికి కరోనా పాజిటివ్

AP Corona update
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో గడచిన 24 గంటల్లో 49,581 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,145 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 216 కొత్త కేసులు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లాలో 173, చిత్తూరు జిల్లాలో 132, కృష్ణా జిల్లాలో 128, ప్రకాశం జిల్లాలో 117, కడప జిల్లాలో 111 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 6 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 1,090 మంది కరోనా నుంచి కోలుకోగా, 17 మరణాలు సంభవించాయి. తాజా మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 13,987కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,28,795 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 19,99,651 మంది పూర్తి ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 15,157 మందికి చికిత్స జరుగుతోంది.
Go Back to Shorts
Andhra Pradesh
Corona Virus
Daily Cases
Deaths

More Telugu News