గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ రాజీనామా
- గుజరాత్ రాజకీయాల్లో ప్రకంపనలు
- గవర్నర్ కు రాజీనామా లేఖ అందజేత
- రూపానీ నిర్ణయంపై తీవ్ర చర్చ
- వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు
ఇటీవల కాలంలో రాజీనామా చేసిన నాలుగో బీజేపీ సీఎం విజయ్ రూపానీ. జులైలో కర్ణాటక సీఎం పదవికి బీఎస్ యడియూరప్ప రాజీనామా చేయగా, ఉత్తరాఖండ్ లో తీర్థ్ సింగ్ రావత్, త్రివేంద్ర సింగ్ రావత్ సీఎం పదవి నుంచి వైదొలిగారు. తాజాగా, విజయ్ రూపానీ సీఎం పదవి నుంచి తప్పుకోవడానికి దారితీసిన కారణాలు ఏంటన్నది తెలియరాలేదు.