CM Jagan: రమ్య తల్లిదండ్రులను క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చిన హోంమంత్రి... అక్కున చేర్చుకుని ఓదార్చిన సీఎం జగన్

CM Jagan consoles Ramya parents
ఇటీవల గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురికావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత రమ్య తల్లిదండ్రులను నేడు సీఎం జగన్ వద్దకు తీసుకువచ్చారు. రమ్య హత్యోదంతం, తదనంతర పరిణామాలను వారు సీఎం జగన్ కు వివరించారు. వారి పరిస్థితి పట్ల తీవ్ర సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్... కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వారిని అక్కున చేర్చుకుని ఓదార్చారు.

రమ్య సోదరికి జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం ఇవ్వాలని అప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. మరో 10 రోజుల్లో ఆమెకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందాలని, వారి కుటుంబం తనతో కలిసి సంతోషంగా టీ తాగాలని నిర్దేశించారు. అంతేకాకుండా రమ్య కుటుంబానికి ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల ఇంటి స్థలం కూడా ఇవ్వాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు హోంమంత్రి సుచరిత మీడియాకు వివరాలు తెలిపారు.

రమ్య హత్య జరిగిన తర్వాత ఆమె కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు సాయం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన చెక్ ను కూడా ప్రభుత్వం అందించింది.
CM Jagan
Ramya
Parents
Mekathoti Sucharitha

More Telugu News