Ramcharan: రామ్ చరణ్-శంకర్ చిత్రం... ఆశ్చర్యపరిచేలా ఫస్ట్ పోస్టర్ విడుదల!

Ram Charan and Shankar movie starts in Hyderabad
షార్ట్స్‌లో చూడండి
అగ్రహీరో రామ్ చరణ్, దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న భారీ చిత్రానికి నేడు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.  

ఇక ఈ సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఆశ్చర్యకరమైన రీతిలో ఓ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు. వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ చిత్రం కావడంతో ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.
Go Back to Shorts
Ramcharan
Shankar
RC15
Dil Raju
Tollywood
Kollywood

More Telugu News