ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు జట్టు ఇదే: షేన్ వార్న్
- టీమిండియా మరో అద్భుత విజయాన్ని సాధించిందన్న వార్న్
- 12 నెలలుగా అద్భుతాలు సాధిస్తున్నారని కితాబు
- ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు జట్టు టీమిండియానే అని ప్రశంస
ట్విట్టర్ ద్వారా వార్న్ స్పందిస్తూ... మరో అద్భుతమైన విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు అని చెప్పాడు. గత 12 నెలలుగా మీరు సాధించినది కచ్చితంగా అద్భుతమైనదని కితాబునిచ్చాడు. ప్రపంచంలో అత్యుత్తమ టెస్టు జట్టు టీమిండియానే అని చెప్పాడు. మరోవైపు చివరి టెస్టు మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10న ప్రారంభం కానుంది.