పవన్ కల్యాణ్ మీద ఒట్టు.. నా మాట నమ్మండి: బండ్ల గణేశ్

Please believe my words says Bandla Ganesh
  • జీవితపై పోటీ చేసి గెలుస్తా
  • మనస్సాక్షికి నచ్చకే ప్యానల్ నుంచి బయటకు వచ్చా
  • మెగా ఫ్యామిలీకి క్షమాగుణం ఎక్కువ
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేశ్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. స్వతంత్ర అభ్యర్థిగా జనరల్ సెక్రటరీ పదవికి జీవితా రాజశేఖర్ పై పోటీ చేసి గెలుస్తానని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ, ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి బయటకు రమ్మని తనకు చిరంజీవిగారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరూ చెప్పలేదని తెలిపారు.

 తన మాటను నమ్మాలని, తన మనస్సాక్షికి నచ్చకే ఆ ప్యానల్ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తాను దేవుడిగా భావించే పవన్ కల్యాణ్ మీద ఒట్టు అని అన్నారు. జీవిత ఎన్ని మాట్లాడినా మెగా ఫ్యామిలీ క్షమించవచ్చేమో కానీ... తాను మాత్రం క్షమించలేనని చెప్పారు. మెగా ఫ్యామిలీ సభ్యులకు క్షమాగుణం ఎక్కువని... కానీ తాను అంత గొప్పవాడిని కాదని అన్నారు.
Go Back to Shorts
Bandla Ganesh
MAA
Chiranjeevi
Pawan Kalyan
Jeevitha

More Telugu News