Rashmika Mandanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Rashmika to be cast opposite Shiva Kartikeyan
షార్ట్స్‌లో చూడండి
*  తమిళ కథానాయకుడు శివకార్తికేయన్ సరసన అందాలతార రష్మిక కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తోంది. 'జాతిరత్నాలు' ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో రష్మిక కథానాయికగా నటించే అవకాశం ఉందని సమాచారం.
*  ప్రస్తుతం 'భీమ్లా నాయక్', 'హరిహర వీరమల్లు' చిత్రాలలో నటిస్తున్న పవన్ కల్యాణ్ దీని తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, పూజ హెగ్డే కథానాయికగా నటించే ఈ చిత్రానికి 'భగత్ సింగ్' అనే టైటిల్ని పరిశీలిస్తున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది త్వరలో తెలుస్తుంది.
*  నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగార్రాజు' చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది. ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య కాంబోలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ, చైతూకి జంటగా కృతిశెట్టి నటిస్తున్నారు.  
Go Back to Shorts
Rashmika Mandanna
Shiva Kartikeyan
Pawan Kalyan
Nagarjuna

More Telugu News