Mahesh Babu: టీచర్స్ డే సందర్భంగా ఆసక్తికరమైన ఫొటో పంచుకున్న మహేశ్ బాబు

  • నేడు గురు పూజ్యోత్సవం
  • తండ్రే తన గురువన్న మహేశ్ బాబు
  • అనేక విషయాలు నేర్చుకున్నానని వెల్లడి
  • తోడ్పాటు అందించిన వారికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్
Mahesh Babu tweet on Teachers Day

ఇవాళ గురు పూజ్యోత్సవం. ఈ సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందించారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో తాను కలిసున్న ఓ ఆసక్తికరమైన ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ఫొటో మహేశ్ బాబు చిన్నప్పటిదని చూడగానే తెలిసిపోతుంది. కళ్లద్దాలు ధరించి ఎంతో క్యూట్ గా ఉన్నాడు.  

దీనిపై మహేశ్ బాబు స్పందిస్తూ... ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం, దృఢమైన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, కరుణ, వినయం కలిగి ఉండడం వంటి అంశాలను తన తండ్రి ద్వారానే నేర్చుకున్నానని వెల్లడించారు. అందుకు తన తండ్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన జీవితంలో అనేక అంశాలు నేర్చుకోవడంలోనూ, వ్యక్తిత్వ పరిణామ క్రమంలోనూ తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మహేశ్ బాబు వివరించారు.

More Telugu News