Pawan Kalyan: ఏపీలో రహదారుల పరిస్థితిపై మరోసారి ధ్వజమెత్తిన పవన్ కల్యాణ్

Pawan Kalyan reacts on AP roads condition again
షార్ట్స్‌లో చూడండి
ఏపీలో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయంటూ జనసేనాని పవన్ కల్యాణ్ మరోసారి ధ్వజమెత్తారు. ఏపీలో రహదారులు మృత్యుద్వారాలుగా మారాయని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ తో జనసేన మూడు రోజుల పాటు చేపట్టిన ఉద్యమం విజయవంతమైందని, 6.2 లక్షల ట్వీట్లు వచ్చాయని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో రోడ్లు ఛిద్రమైపోయి ఉన్నాయని పవన్ వ్యాఖ్యానించారు.

ఈ మేరకు పార్టీ కార్యాలయంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో రోడ్ల దుస్థితిని వెల్లడించే చాయాచిత్రాలను ప్రదర్శించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.
Go Back to Shorts
Pawan Kalyan
AP Roads
Jansena
Andhra Pradesh

More Telugu News