Nadendla Manohar: గతుకుల రోడ్డుపై బస్సు వెనుక చక్రాలు ఊడిన వైనం... ఫొటోలు పంచుకున్న నాదెండ్ల

  • దెబ్బతిన్న రోడ్ల దుష్ఫలితం అని వెల్లడి
  • గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళుతున్న బస్సు
  • టైర్లు లేక రోడ్డుపై నిలిచిన బస్సు
  • రోడ్డు ఎలా ఉందో చూడండన్న నాదెండ్ల
Nadendla shares some photos of a bus which lost its back tyres on a ugly road

ఏపీలో గతుకుల రోడ్ల పరిస్థితి వర్షాకాలంలో మరింతగా క్షీణిస్తోందని జనసేన నేతలు కొన్నిరోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పరిస్థితిపై జనసేనాని పవన్ కల్యాణ్ సైతం తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన ఫొటోలు పంచుకున్నారు. ఓ ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు ఊడిన స్థితిలో రోడ్డుపై నిలిచిపోయి ఉండడం ఆ ఫొటోల్లో చూడొచ్చు.

దెబ్బతిన్న రోడ్ల దుష్ఫలితం అంటూ నాదెండ్ల బస్సు పరిస్థితిపై స్పందించారు. తూర్పు గోదావరి జిల్లాలో గోకవరం నుంచి గుర్తేడు పాతకోట వెళ్లే బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయని వెల్లడించారు. ఆ రోడ్డు ఎలా ఉందో చూడండి అంటూ ఫొటోలు ట్వీట్ చేశారు.

More Telugu News