అశోక్ గజపతిరాజు హయాంలో అప్పన్న ఆలయంలో అన్నీ కుంభకోణాలే: విజయసాయి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అశోక్ గజపతిరాజు హయాంలో అప్పన్న ఆలయంలో అన్నీ కుంభకోణాలే: విజయసాయి

Vijayasai Reddy slams Ashok Gajapathi Raju
  • అశోక్ గజపతిరాజుపై ధ్వజమెత్తిన విజయసాయి
  • అశోక్ పాత్రపై అనుమానంగా ఉందని వెల్లడి
  • వేల కోట్ల ఆస్తులు అన్యాక్రాంతం అయ్యాయని వ్యాఖ్యలు
  • అప్పన్న ఆలయ ఆస్తులు కాపాడతామని ఉద్ఘాటన
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై ధ్వజమెత్తారు. అశోక్ గజపతిరాజు హయాంలో సింహాద్రి అప్పన్న ఆలయంలో అన్నీ కుంభకోణాలేనని ఆరోపించారు. 846 ఎకరాలు పరాధీనం అయ్యాయని ఆయన చెప్పారు.

అశోక్ గజపతిరాజు పైకి చెప్పేది ఒకటి, చేసేది మరొకటి అని విమర్శించారు. అప్పన్న ఆలయ ఆస్తులు దోచుకోవడంలో అశోక్ పాత్రపై సందేహాలు కలుగుతున్నాయని, అక్రమాలకు పాల్పడకపోతే కోర్టుకు వెళ్లి మళ్లీ పదవి ఎందుకు తెచ్చుకున్నట్టు? అని విజయసాయి ప్రశ్నించారు. అశోక్ హయాంలో జరిగిన అవినీతిని నిగ్గుతేల్చి, ఆలయ ఆస్తులను పరిరక్షిస్తామని స్పష్టం చేశారు.

సుమారు రూ.8 వేల కోట్ల విలువైన అప్పన్న ఆలయ ఆస్తులను వెనక్కి తీసుకురాగలమా? అనే బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు. అలయ ఆస్తులు అన్యాక్రాంతం అవుతుంటే ధర్మకర్తగా ఉన్న అశోక్ ఏంచేస్తున్నట్టు? అని నిలదీశారు.
Vijayasai Reddy
Ashok Gajapathi Raju
Simhachalam Temple
YSRCP
TDP
Andhra Pradesh

More Telugu News