సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- హిందీ సినిమా పూర్తి చేసిన రష్మిక
- సోషల్ మీడియాలో మహేశ్ రికార్డు
- 'మ్యూజిక్ స్కూల్' నాయికగా శ్రియ
* సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుంటాడు. ఎప్పుడూ అప్ డేట్స్ ఇస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంటారు. ఈ క్రమంలో ఆయన ఫేస్ బుక్ ఖాతా ఫాలోవర్ల సంఖ్య తాజాగా 15 మిలియన్లు దాటింది. దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.
* ప్రముఖ నటి శ్రియ తాజాగా ఓ చిత్రానికి సంతకం చేసింది. బియ్యాల పాపారావు దర్శకత్వంలో రూపొందే 'మ్యూజిక్ స్కూల్' అనే చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఇందులో శర్మన్ జోషి ఆమెకు జంటగా నటిస్తాడు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చే ఈ చిత్రాన్ని పలు భాషల్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.