సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారు
- మూడ్రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్న సీఎం కేసీఆర్
- సెప్టెంబరు 1న ఢిల్లీ పయనం
- సెప్టెంబరు 2న టీఆర్ఎస్ పార్టీ ఆఫీసుకి భూమిపూజ
- సెప్టెంబరు 3న తిరిగి రాక
హస్తినలోని వసంత్ విహార్ మెట్రో స్టేషన్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు కోసం కేంద్రం 1,300 గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో సెప్టెంబరు 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు కూడా పాల్గొంటారు. తిరిగి సెప్టెంబరు 3న సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వస్తారు.