పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం.. డిస్కస్ త్రోలో యోగేశ్‌కు రజతం
- పారాలింపిక్స్‌లో పోటీపడి పతకాలు సాధిస్తున్న భారత అథ్లెట్లు
- భారత్‌కు నేడు నాలుగు పతకాలు
- పారాలింపిక్స్‌లో భారత్‌కు ఇన్ని పతకాలు ఇదే తొలిసారి
అలాగే, జావెలిన్ త్రో ఎఫ్ 46 విభాగంలో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి. దేవేంద్ర జజారియా రజత పతకం గెలుచుకోగా, సుందర్ సింగ్ గుర్జార్ కాంస్య పతకంతో మెరిశాడు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఆరు పతకాలు సొంతమయ్యాయి. కాగా, నిన్న డిస్కస్ త్రోలో వినోద్ కుమార్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించినప్పటికీ ఈ విషయంలో నేడు స్పష్టత రానుంది. ఇది కూడా కలిస్తే భారత్ సాధించిన పతకాల సంఖ్య ఏడుకు చేరుకున్నట్టే. పారాలింపిక్స్‌లో భారత్ ఇన్ని పతకాలు సాధించడం ఇదే తొలిసారి.