Arya: 'అరణ్మనై 3' నుంచి ఫస్టు సింగిల్ రెడీ!

  • 'అరణ్మనై' రెండు భాగాలు హిట్
  • రెండు భాగాల్లోను హన్సికదే ప్రధాన పాత్ర
  • ఈ సారి రాశి ఖన్నాకు అవకాశం
  • ఈ నెల 30వ తేదీన ఫస్టు సింగిల్  
Aaranmanai 3 movie update

తమిళనాట హారర్ థ్రిల్లర్ సినిమాలు చేసే దర్శకులలో సుందర్.సి ఒకరు. 'అరణ్మనై' సిరీస్ ను ఆయన మొదలుపెట్టి చాలాకాలమైంది. 'అరణ్మనై'లో హన్సిక .. రాయ్ లక్ష్మి .. ఆండ్రియా ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ సినిమా తమిళనాట భారీ విజయాన్ని సాధించింది.

ఆ తరువాత ఆయన హన్సిక .. త్రిష  .. సిద్ధార్థ్ ప్రధాన పాత్రధారులుగా 'అరణ్మనై 2' సినిమాను తెరకెక్కించాడు. తమిళంతో పాటు తెలుగులో 'చంద్రకళ' టైటిల్ తో భారీ వసూళ్లను రాబట్టింది. మళ్లీ సుందర్ సి ఈ సినిమాకి కొనసాగింపుగా 'అరణ్మనై 3' సినిమాను రూపొందించాడు.

ఈ సారి ఆర్య - రాశి ఖన్నా ప్రధానమైన పాత్రలను పోషించారు. ఆండ్రియా .. సాక్షి అగర్వాల్ .. ఖుష్బూ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ స్పెషల్ పోస్టర్ ను వదిలారు.

More Telugu News