అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌పై టాలీవుడ్ హీరో నిఖిల్ తీవ్ర వ్యాఖ్య‌లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌పై టాలీవుడ్ హీరో నిఖిల్ తీవ్ర వ్యాఖ్య‌లు

nikhil warns biden
  • 21 ఏళ్లు ఆ దేశాన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారు
  • చివరకు ఈ ప‌రిస్థితుల్లో ఆఫ్ఘ‌న్ ను వదిలేసి వెళ్లిపోయారు
  • మిస్టర్ బైడెన్ మరోసారి స్వేచ్ఛ గురించి ప్ర‌సంగాలు  ఇవ్వ‌కూడ‌దు
ఆఫ్ఘ‌నిస్థాన్ నుంచి అమెరికా స‌హా నాటో ద‌ళాలు వెన‌క్కి వెళ్లిపోతోన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆఫ్ఘ‌న్‌లో ప‌రిస్థితులు చేజారిపోతుండ‌డంతో అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాలిబ‌న్ల తీరుపై అనేక దేశాల ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

బైడెన్ తీరుపై తాజాగా టాలీవుడ్ హీరో నిఖిల్ స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశాడు. 20 ఏళ్లు ఓ దేశాన్ని అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆయ‌న అన్నాడు. చివరకు ఈ ప‌రిస్థితుల్లోకి ఆఫ్ఘ‌న్‌ను నెట్టేసి అమెరికా వెళ్లిపోయింద‌ని విమర్శించాడు. బైడెన్ మరోసారి స్వేచ్ఛ గురించి ప్ర‌సంగాలు ఇస్తే చెప్పు తెగుద్దని అన్నాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశాడు.
nikhil
Joe Biden
USA

More Telugu News