బైడెన్ విధానాలను తప్పుబట్టిన ట్రంప్.. ఆఫ్ఘనిస్థాన్‌ను ఉగ్రవాదులకు అప్పగించారంటూ నిప్పులు
- తనిఖీలు లేకుండా ఎలా తరలిస్తారు?
- ఇప్పటికే వేలాదిమంది ఉగ్రవాదులు విదేశాలకు చేరారు
- అమెరికా పౌరులను తరలించకుండా బలగాలు ఎలా ఉపసంహరిస్తారు?
- బైడెన్‌పై విరుచుకుపడిన ట్రంప్
తనిఖీలు లేని విచ్చలవిడి తరలింపు వల్ల ఇప్పటికే వేలమంది ఉగ్రవాదులు విదేశాలకు చేరుకుని ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వేలాదిమంది అమెరికన్ల ప్రాణాలను బైడెన్ ప్రమాదంలోకి నెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 26 వేల మందిని ఆఫ్ఘనిస్థాన్ నుంచి తరలించారని, వారిలో 4 వేల మంది మాత్రమే అమెరికన్లు ఉన్నారని తన వద్ద కచ్చితమైన సమాచారం ఉందని ట్రంప్ అన్నారు. తనిఖీలు లేకుండా తరలింపు చేపట్టడం ఘోర వైఫల్యమేనని ట్రంప్ ధ్వజమెత్తారు.