Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Samantha wants to do more projects in Bollywood
షార్ట్స్‌లో చూడండి
*  అందాలతార సమంత బాలీవుడ్ ప్రాజక్టులపై దృష్టి పెడుతోంది. ఈ విషయం గురించి ఈ చిన్నది తాజాగా చెబుతూ, బాలీవుడ్ ప్రాజక్టులు చేయడానికి నేను సిద్ధంగా వున్నాను. అయితే, ఇంతకుముందు నేను చేయనటువంటి క్యారెక్టర్లతో కూడిన కథలు రావాలి. ఆ పాత్ర చేయాలి అని నాకు వెంటనే అనిపించాలి. అలాంటివి వస్తే కనుక తప్పకుండా చేస్తాను' అని చెప్పింది. ఇదిలావుంచితే, ప్రస్తుతం కొన్నాళ్ల పాటు ఈ ముద్దుగుమ్మ బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే.
*  మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని తెలుగులో చిరంజీవి హీరోగా 'గాడ్ ఫాదర్' పేరిట రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు బిజూ మీనన్ కీలక పాత్ర పోషించనున్నట్టు తాజా సమాచారం.
*  ప్రముఖ తమిళ దర్శకులు మణిరత్నం, శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్ కలసి సంయుక్తంగా చిత్ర నిర్మాణాన్ని చేబడుతున్నారు. ఇందుకోసం 'రైన్ ఆన్ ఫిలిమ్స్' అనే బ్యానర్ ను నెలకొల్పారు. ఈ బ్యానర్ పై ముఖ్యంగా ఓటీటీ వేదికల కోసం చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా వీరు నిర్మించే తొలి చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తాడట.  
Go Back to Shorts
Samantha
Chiranjeevi
Biju Menon
Lokesh Kanagaraj

More Telugu News