Samantha: నయనతార, సమంతల ఫుట్‌బోర్డ్ ప్ర‌యాణం.. తమిళ సినిమా ముచ్చట.. వీడియో వైర‌ల్

samanta nayan video goes viral
షార్ట్స్‌లో చూడండి
షూటింగులో భాగంగా బ‌స్సు ఫుట్‌బోర్డ్ పై నిల్చొని ప్ర‌యాణించారు హీరోయిన్లు స‌మంత‌, న‌య‌న‌తార‌. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది. వారి ప‌క్క‌నే విజ‌య్ సేతుప‌తి కూడా ఉన్నాడు. ప్ర‌స్తుతం వీరు ముగ్గురు తమిళ సినిమా 'కాతువాకుల రెండు కాదల్' లో న‌టిస్తున్నారు.

ఈ సినిమాకు విగ్నేశ్‌ శివన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా ఇటీవ‌ల చెన్నైలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. బ‌స్సులో స‌మంత‌, న‌య‌న‌తార‌, విజ‌య్ సేతుప‌తి ప్ర‌యాణించాల్సి ఉంటుంది. ఫుట్‌బోర్డ్‌పై నిలబ‌డి ప్ర‌యాణిస్తూ వారు మాట్లాడుకుంటారు. ఇందులో హీరోయిన్లు ఇద్ద‌రూ తెల్ల చీర‌లు ధ‌రించి క‌న‌ప‌డ్డారు. బ‌స్సు మొత్తం ప్ర‌యాణికుల‌తో నిండిపోయి ఉండ‌డంతో వారు ముగ్గురూ ఇలా ఫుట్‌బోర్డుపై ప్ర‌యాణిస్తున్న‌ట్లు సీను తీశారు.
Go Back to Shorts
Samantha
Nayanthara
Kollywood

More Telugu News